Sneha| ఒకప్పుడు టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ స్నేహ. 2000 నుంచి 2020 వరకు హీరోయన్ గా చాలా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకునేది. ఎక్కడ కూడా అశ్లీలతకి చోటు లేకుండా సినిమాలలో తన పాత్రలు ఎంచుకునేది. అయితే సినిమాలలో కొనసాగుతున్న సమయంలోనే స్నేహ 2012 మే 11న ప్రసన్న అనే నటుడిని వివాహం చేసుకుంది. తమిళ సినిమా షూటింగ్లో కలుసుకున్న వీరు, ఆ సినిమా షూటింగ్ అయిపోయే వరకు ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ప్రస్తుతం స్నేహ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలు కాస్త తగ్గించిన స్నేహ సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో మెరుస్తుంది. రామ్ చరణ్ వినయవిధేయ రామ సినినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనంతరం పలు హిట్ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ పోషించింది. గత ఏడాది వెంకట్ ప్రభు డైరెక్షన్లో ‘గోట్’ సినిమాలో విజయ్ దళపతి భార్యగా నటించి మెప్పించింది. టాలీవుడ్ లో సావిత్రి, సౌందర్య తరువాత అంత పద్దతిగల హీరోయిన్ గా స్నేహాకు మంచి పేరు ఉంది. కమర్షియల్ సినిమాలు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో స్నేహ చీర కట్టుతోనే ఎక్కువగా కనిపించింది.
తాజాగా స్నేహకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. గతంలో స్నేహ తన భర్తతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో తనకి ఓసీడీ ఉందని తెలిపింది. దానికి వెంటనే రియాక్ట్ అయిన స్నేహ భర్త ప్రసన్న.. అవును ఇల్లు అది బాలేదు ఇది బాలేదు అంటూ 3 సార్లు మార్చింది. ఇక ఆమె మార్చకుండా ఉన్నది నన్ను ఒక్కడినే అంటూ సెటైర్ వేశాడు.అప్పుడు స్నేహ స్పందిస్తూ.. అవును నాకు ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. కిచెన్ క్లీన్ లేకపోతే అస్సలు ఊరుకోను. ఈ ఓసీడీ సమస్య అరుదైనదే అయిన అంతగా భయపడాల్సిన పని లేదు అంటూ స్నేహ అప్పట్లో చెప్పుకు రాగా, ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.