మూడేండ్ల తర్వాత నాగ శౌర్యకు సమాధానం చెప్పిన సాయి పల్లవి..
Sai Pallavi | సాయిపల్లవిపై మూడేండ్ల కింద నాగశౌర్య కొన్ని విమర్శలు చేశాడు. సాయిపల్లవి చాలా అన్ ప్రొఫెషనల్ అని.. సెట్లో ఆమె వల్ల చాలామంది
Sai Pallavi | తెలుగు ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు స్టార్ హీరోలతో నటించకపోయినా కూడా ఆమె స్టార్ హీరోయిన్. ముఖ్యంగా సాయి పల్లవి సినిమాలో ఉంటే చాలు ఆమె పర్ఫార్మెన్స్తో సినిమా రేంజ్ పెరుగుతుందనే నమ్మకం దర్శక నిర్మాతలతో పాటు.. ప్రేక్షకులలో కలిగించింది ఈ ముద్దుగుమ్మ. ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి.. ఇప్పటి వరకు నటించింది అరడజను సినిమాలే అయినా కూడా మంచి నటిగానే కాదు వ్యక్తిత్వం ఉన్న మనిషిగా కూడా గుర్తింపు సంపాదించుకుంది. ఈమెను ఎవరైనా ఒక మాట అనాలి అంటే వెనక ముందు ఆలోచిస్తారు. ఎందుకంటే సాయి పల్లవి బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. అలాంటి హీరోయిన్‌పై మూడేండ్ల కింద నాగశౌర్య కొన్ని విమర్శలు చేశాడు.
సాయిపల్లవి చాలా అన్ ప్రొఫెషనల్ అని.. సెట్లో ఆమె వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు అని.. టైమ్ సెన్స్ కూడా లేదంటూ విమర్శల వర్షం కురిపించాడు నాగశౌర్య. ఈ ఇద్దరూ కలిసి ఏఎల్ విజయ్ దర్శకత్వంలో వచ్చిన కణం సినిమాలో నటించారు. కేవలం దర్శకుడు మాత్రమే కాదు సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కూడా సాయి పల్లవి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అంటూ మీడియా ముఖంగా నాగశౌర్య చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ విమర్శలకు మూడేండ్ల తర్వాత ఇప్పుడు సమాధానం చెప్పింది సాయి పల్లవి. కణం చిత్ర దర్శకుడు ఎ.ఎల్.విజయ్, కెమెరామెన్ నీరవ్ షాకు ఫోన్ చేసి ‘సెట్లో నా వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా’ అని ఆమె ప్రశ్నించగా.. దానికి వాళ్లు అలాంటిది ఏమీ లేదని చెప్పారు. ఆ తర్వాత సాయి పల్లవి మాట్లాడుతూ నటుడిగా తనకు నాగశౌర్య అంటే ఎంతో గౌరవం ఉందని.. ఆయన తనలో నచ్చని గుణం గురించి బయటకు చెప్పారు.. కానీ తాను దాన్ని పాజిటివ్‌గానే తీసుకున్నానని చెప్పింది సాయి పల్లవి. నిజంగా సెట్లో తన వల్ల అతనికి ఇబ్బంది కలిగింది అంటే బాధగా ఉందని తెలిపింది. తన సమాధానంతో ఇప్పుడైనా ఆయన సంతృప్తి చెందుతారని ఆశిస్తున్నా అంటూ క్లారిటీ ఇచ్చింది ఈ హీరోయిన్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
“మహేశ్ బాబు చెల్లిగా సాయి పల్లవి.. కాంబినేషన్ అదుర్స్ కదూ..
Sai Pallavi | చూపులతో చంపేస్తున్న సాయిపల్లవి..
“Sai Pallavi | హిందీ సినిమాకు సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్..డైరెక్టర్లు రెడీనా..?
సాయిపల్లవితో అలాంటి సినిమా చేయాలని అనుకున్నా: నాని
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

