Rashmika Mandanna | సినీరంగంలో నటీమణులకు గుర్తింపు రావడానికి చాలా సమయమే పడుతుంది. అదే కొందరు నటీమణులు మాత్రం ఒకటి, రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్‌ను సంపాదించుకుంటారు. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన కథానాయిక రష్మిక మందన్న. కన్నడలో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఈమె సౌత్ నుంచి నార్త్ వరకు స్టార్ హీరోలతో కలిసి నటిస్తుంది. ఇక ఈమె క్రేజ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవలే రష్మిక లెహంగాతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ఆ లెహంగా ధర సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రష్మిక ధరించిన లెహంగా ధర దాదాపు రూ.1,70,000 అట. లెహంగా కోసం రష్మిక అంత ఖర్చు పెట్టిందా అని కొందరు నెటిజన్లు నోరు వెళ్ళబెడుతున్నారు. మరి కొందరు నెటిజన్లు మాత్రం రష్మిక సంపాదిస్తున్న దానికి ఇది తక్కువే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక రష్మిక ప్రస్తుతం తెలుగులో సీతారామంలో నటిస్తుంది. బాలీవుడ్లో ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’ సినిమాల్లో నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు సందీప్‌రెడ్డి ‘యానిమల్’ షూటింగ్లో బిజీగా గడుపుతుంది.