Actress Rambha | ముప్పై ఏళ్ళ క్రితం ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది రంభ. తొలి సినిమానే రంభకు తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సూపర్ కృష్ణ, చిరంజీవి, సల్మాన్ ఖాన్, రజనీకాంత్, విజయ్, తదితర అగ్ర నటులతో నటించింది ఈ భామ. అయితే కొన్నేళ్లుగా సినీ రంగానికి దూరంగా ఉంటున్న ఆమె తాజాగా రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈ విషయంపై ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో స్పందించారు.
రంభ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. రంభ ఆర్థికంగా ప్రస్తుతం స్థిరంగా ఉన్నారు. ఆమె భర్త కూడా ఒక ప్రముఖ వ్యాపారి. అయితే అతడు కొన్ని రోజుల క్రితం నన్ను కలిసినప్పుడు రంభకు ఒక గొప్ప సినిమా ప్రాజెక్ట్‌లో అవకాశం కల్పించమని కోరారు. అటువంటి అవకాశం దొరికితే ఆమెను తప్పక సంప్రదిస్తానని ఆయనకు హామీ ఇచ్చాను అని తెలిపారు. ఈ విషయంతో, ఈ నటి త్వరలో సినీ రంగంలోకి మళ్లీ అడుగుపెడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
మరోవైపు రీ ఎంట్రీపై రంభ మాట్లాడుతూ సినీరంగంలోకి పునరాగమనానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నా. నా వయసుకు తగినట్లు చాలెంజింగ్ రోల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మంచి పాత్రల ద్వారా తిరిగి ప్రేక్షకుల అభిమానం సంపాదించుకోవాలనుకుంటున్నా అని చెప్పింది.