Rakul Preet Singh | మైనస్ 15 డిగ్రీల చలిలో బికినీ వేసి.. అందాలతో మతిపోగొడుతున్న రకుల్
Rakul Preet Singh | టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ స్టేటస్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్‌కు ఇప్పుడు అవకాశాలు చాలావరకు తగ్గిపోయాయి. తెలుగులో అవకాశాలు తగ్గుతుండటంతో బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన ఈ ఢిల్లీ భామ.. అక్కడ వరుస సినిమాలకు కమిట్ అవుతోంది. అదే టైమ్‌లో ఫ్యాన్స్‌కు దూరం కాకుండా ఉండేందుకు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తోంది.
Rakul Preet Singh | టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ స్టేటస్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్‌కు ఇప్పుడు అవకాశాలు చాలావరకు తగ్గిపోయాయి. తెలుగులో అవకాశాలు తగ్గుతుండటంతో బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన ఈ ఢిల్లీ భామ.. అక్కడ వరుస సినిమాలకు కమిట్ అవుతోంది. అదే టైమ్‌లో ఫ్యాన్స్‌కు దూరం కాకుండా ఉండేందుకు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా పోస్టు చేసిన ఓ బికినీ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో సెగలు పుట్టిస్తోంది.

Rakul
ఇన్‌స్టాగ్రామ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ పోస్టు చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఆమె ఎక్స్పోజింగ్ కంటే కూడా ఆమె చేసిన ఫీట్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అంతలా ఏం సాహసం చేసిందని అనుకుంటున్నారా? మైనస్ 15 డిగ్రీల ఎముకలు కొరికే చలిలో ఐస్ బాత్ చేసింది. ఓ కట్టెల ఇంటిలో నుంచి బికినీలో నడుచుకుంటూ వచ్చిన రకుల్.. అక్కడే గడ్డకట్టిన మంచు మధ్యలో ఉన్న నీటిలో కాసేపు మునిగింది. ఆ తర్వాత నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. రకుల్ షేర్ చేసిన ఈ వీడియోను చూసిన అభిమానులు అవాక్కవుతున్నారు. అంతటి గడ్డకట్టే చలిలో అలా బికినీలో ఐస్ బాత్ చేయడం నిజంగా సాహసమే అంటూ ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు.
మరికొందరు నెటిజన్లు అయితే.. అసలు రకుల్ అంత గడ్డ కట్టే చలిలో ఎందుకంత సాహసం చేసిందని చెవులు కొరుక్కుంటున్నారు. దీనికి తమకు తెలిసిన ఓ సమాధానం కూడా చెబుతున్నారు. రకుల్ పోస్టు చేసిన వీడియోలో క్రియో ఇన్ మైనస్ 15 డిగ్రీస్ అని పోస్టు చేసింది. దీంతో రకుల్ క్రియోథెరపీ చేయించుకుంటుందని.. అందుకే ఇంతటి చలిలో ఈ ఫీట్ చేసిందని అనుకుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

