Pooja ramachandan-John kokken | బిగ్‌బాస్ ఫేమ్ పూజా రామచంద్రన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త, నటుడు జాన్ కొక్కెన్ సోషల్‌మీడియాలో వెల్లడించాడు. బాబు వేలిని పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఆ బాబుకు కియాన్ కొక్కన్ అని పేరు పెట్టినట్లు తెలిపాడు. ‘మా చిట్టిబాబు వచ్చాడు.. మా జీవితాల్ని పరిపూర్ణం చేసి, మాకు సంతోషాన్ని ఇచ్చే బాబు మా జీవితంలోకి వచ్చాడు. కియాన్ కొక్కెన్‌కు ఈ ప్రపంచంలోకి స్వాగతాన్ని చెబుతున్నాం. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలంటూ’ జాన్ సోషల్ మీడియాలో పోస్ట్ వేశాడు.
ఇక ‘7th సెన్స్’, ‘స్వామి రారా’, ‘కాంచన’ వంటి పలు సినిమాలతో పూజా రామచంద్రన్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ రెండో సీజన్లో పూజా వైల్డ్ కార్డ్‌గా వచ్చి అందరినీ ఆకట్టుకుంది. మగ కంటెస్టెంట్లకు ధీటుగా టాస్కులు ఆడి బాగానే గెలిచింది. కాగా పూజా మూడేళ్ల కిందట తమిళ నటుడు జాన్ కొక్కెన్‌ను పూజా పెళ్లిచేసుకుంది. ఇక వీరిద్దరూ వేసే వెకేషన్లు, షేర్ చేసే ఫోటో షూట్లు నెట్టింట తెగ వైరల్ అవుతూనే ఉంటాయి. నటుడు జాన్ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో తమిళ, తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు వేశాడు.