Actress Nidhhi Agerwal | హరిహర వీరమల్లు హీరోయిన్ సినీ నటి నిధి అగర్వాల్(Nidhhi Agerwal) అత్తాపూర్(Attapur)లో సందడి చేసింది. అత్తాపూర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్ బ్రదర్స్(RS Brothers) 13వ షోరూమ్‌ను సినీనటి నిధి అగర్వాల్ ఆవిష్కరించారు. ఆర్ఎస్ బ్రదర్స్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ షోరుమ్ని ఏర్పాటు చేయగా.. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పి. వెంకటేశ్వర్లు, ఎస్. రాజమౌళి, టీ. ప్రసాదరావు సహా షోరూమ్ నిర్వాహకులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్ నిర్వహాకులు మాట్లాడుతూ.. వినియోగదారులకు ఉన్నత స్థాయి సేవలను అందించడంలో ఆర్ఎస్ బ్రదర్స్ ఎల్లప్పుడూ అగ్రగామిగా ఉంటుందని తెలిపారు. అత్తాపూర్‌లో 13వ షోరూమ్‌ను స్థాపించడం ద్వారా కస్టమర్లకు మరింత ఉత్తమమైన వస్త్ర ఎంపికలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ నిర్వాహకులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.
సినిమాల విషయానికి వస్తే.. నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu) చిత్రంలో నటిస్తుంది. ఇదే కాకుండా ప్రభాస్ హీరోగా వస్తున్న రాజాసాబ్ (Raaja Saab) చిత్రంలో కూడా నిధి హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం.
Nidhi Agerwal