Mrunal Thakur | సీతారామం సినిమాతో టాలీవుడ్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్. ఈ ఒక్క సినిమా తెచ్చిన పాపులారిటీతో ఇప్పుడు ఈమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం సెల్ఫీ, నాని30 సినిమాలకు కమిట్ అయ్యింది. ఇంకా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఈ క్రమంలో ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్‌పై విమర్శలు గుప్పించాడు. రెండు నాల్కల ధోరణిని ఫాలో అవుతుందంటూ ట్రోల్ చేశాడు. దీంతో మృణాల్ ఠాకూర్ సీరియస్ అయ్యింది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ఠాకూర్‌కు కాబోయే భర్త ఎలా ఉండాలనే ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన మృణాల్ మంచివాడు అయితే చాలు.. అందం అసలు విషయం కాదని చెప్పింది. రీసెంట్గా కపిల్ శర్మ టాక్ షోలో పాల్గొన్నప్పుడు కూడా సేమ్ ప్రశ్న ఎదురైంది. ఈ సారి ఆమె తనకు కాబోయేవాడు అందగాడై ఉండాలని సమాధానమిచ్చింది. ఈ విషయాన్నే అభిమానులతో మృణాల్ ఠాకూర్ చిట్‌చాట్ సందర్భంగా.. ఓ నెటిజన్ ప్రస్తావించాడు. మృణాల్ రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతుందంటూ పేర్కొన్నాడు. దీనిపై మృణాల్ అసహనం వ్యక్తం చేసింది. కాబోయే భర్త ఎలా ఉండాలనే విషయంలో గతంలోనూ.. ఇప్పుడూ తనకు ఉన్న అభిప్రాయాన్ని కనీసం ధైర్యంగా చెప్పగలిగాను అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో పలువురు నెటిజన్లు మృణాల్ ఠాకూర్‌పై ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అవి చూసి విసిగిపోయిన ఆమె.. మేము కూడా మనుషులమే అన్న విషయాన్ని మరిచిపోకండి అంటూ అసహనం వ్యక్తం చేసింది. ట్రోల్స్ చేసేవాళ్లు అలాగే కంటిన్యూ చేస్తుండగా.. మరికొంతమంది మాత్రం మృణాల్‌కు మద్దతుగా నిలబడ్డారు.