Brahmastra | ‘బ్రహ్మస్త్ర’ నుండి మరో పోస్టర్ రిలీజ్.. భయపెట్టిస్తున్న మౌనిరాయ్ లుక్!
Mouni Roy First Look | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘బ్రహ్మస్త్ర’ ఒకటి. బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ సింగ్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. తెలుగులో బ్రహ్మస్త్రం పేరుతో విడుదల కానుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి విడుదల చేస్తున్నాడు. నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తుంది. మేకర్స్ తాజాగా మరో బిగ్ అప్డేట్ను ప్రకటించారు.
ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న మౌనిరాయ్ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. మౌనిరాయ్ ఈ చిత్రంలో జునూన్ పాత్రలో నటిస్తుంది. ‘అందరిని వశంలోకి తీసుకునే చీకటిరాణి.. బ్రహ్మస్త్రాన్ని తన సొంత చేసుకోవడమే తన లక్ష్యం’ అంటూ మౌనిరాయ్ పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషాయన్ని చెప్పారు. ఈ పోస్టర్లో మౌనిరాయ్ క్రూరత్వంతో భయంకరంగా కనిపిస్తుంది. లేటెస్ట్గా విడుదలైన నాగార్జున పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. కాగా ఈ సినిమా ట్రైలర్ జూన్ 15న విడుదల కానుంది. ఇటీవలే తెలుగు ట్రైలర్‌కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మైథలాజికల్ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మూడు భాగాలుగా తెరకెక్కనుంది. అందులో మొదటి భాగం ‘శివ’ పేరుతో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. బిగ్‌బీ అమితాబ్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి.
कर ले सबको वश में अपने, अँधेरे की रानी है।
ब्रह्मास्त्र को हासिल करना, यह जुनून ने ठानी है |
Duty and Obsession.
Creation and Destruction.
Light and Dark.In our world of Light, we present to you the face of Darkness – Here is the mysterious, Junoon. #Brahmastra pic.twitter.com/PhnOIWCj8K
— Dharma Productions (@DharmaMovies) June 14, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

