Malavika Mohanan | వ్యూస్ కోసం దిగజారొద్దు.. జర్నలిస్టులకు మాళవిక మోహనన్ స్ట్రాంగ్ కౌంటర్
Malavika Mohanan | ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో తమిళనాడు మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలపై ప్రముఖ నటి మాళవిక మోహనన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Malavika Mohanan | ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో తమిళనాడు మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలపై ప్రముఖ నటి మాళవిక మోహనన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. నిన్న తాను ఒక కార్యక్రమానికి హాజరయ్యానని, తమిళనాడు మీడియా మరియు జర్నలిస్టుల పట్ల తనకు ఎంతో గౌరవం ఉన్నప్పటికీ, అక్కడ జరిగిన సంఘటన తనను బాధించిందని ఆమె పేర్కొన్నారు. నిన్నటి ఈవెంట్లో ఒకరిద్దరు రిపోర్టర్లు పదే పదే చాలా అసభ్యకరమైన, అనవసరమైన ప్రశ్నలు అడిగారని, కేవలం వ్యూస్, పాపులారిటీ కోసమే వారు అలా ప్రవర్తించారని ఆమె మండిపడ్డారు.
దళపతి విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయనతో తనకు గత ఏడేళ్లుగా మంచి పరిచయం ఉందని మరియు ఆయనపై తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. విజయ్‌ని తన మంచి స్నేహితుడిగా భావించడానికి తాను ఎప్పుడూ గర్వపడతానని, ఒక నటుడిగా మరియు వ్యక్తిగా ఆయన సాధించిన ఎదుగుదలను, అద్భుతమైన ప్రయాణాన్ని పక్కనుండి చూడటం ఒక గొప్ప అనుభూతి అని ఆమె వివరించారు. భవిష్యత్తులో జరిగే ప్రెస్ మీట్లలో లేదా మీడియా సమావేశాలలో సెలబ్రిటీలను గౌరవిస్తూ, మర్యాదపూర్వకంగా ప్రశ్నలు అడగాలని, అది అందరికీ మంచిదని ఆమె కోరారు.
I went for an event yesterday, and while I have the utmost regard for all the journalists and members of the Tamil Nadu media, a couple of them persistently asked some very distasteful questions that were completely unnecessary and sensational.
Thalapathy Vijay is someone I’ve…
— Malavika Mohanan (@MalavikaM_) May 16, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

