హైదరాబాద్ : సినిమా రంగంలో ఉన్న మహిళలపై అనుచితంగా మాట్లాడిన టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై (JC Prabhakar Reddy) చర్యలు తీసుకోవాలని సినీ నటి మాధవి లత ( Madhavilatha) కోరారు. ఈ మేరకు శనివారం ‘మా’ అసోసియేషన్ (Movie Artists Association) ట్రెజరర్ శివ బాలాజీకి ఫిర్యాదును అందజేశారు.
సినీరంగంలోని మహిళలపై జరుగుతున్న వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వారిపై ఆరోపణలు చేయడం కరెక్టు కాదంటూ పేర్కొన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు మానవహక్కుల సంఘానికి, పోలీసులకు, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫిర్యాదు చేశాను. ఎవరూ స్పందించలేదు. అందుకే ‘మా’ కు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. న్యాయం కోసం పోరాడుతానంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై మా అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసిన నటి మాధవీలత https://t.co/67DYt1XSG3 pic.twitter.com/MGi7Td94eH
— Telugu Scribe (@TeluguScribe) January 18, 2025
అసలు ఏం జరిగిందంటే ?..
డిసెంబర్ 31న రాత్రి నూతన సంవత్సరం (New Year Celebrations) సందర్భంగా తాడిపత్రిలో జేసీ పార్కులో మహిళలకు మాత్రమే అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై మాధవి లత స్పందించింది. ఇలాంటి వేడుకలకు వెళ్లవద్దని, తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడుతారని పోస్టు చేశారు.
ఈ పోస్టుపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవిలతపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఆమె వ్యభిచారి అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఈ వ్యాఖ్యలపై ఆ తరువాత జేసీ ప్రభాకర్‌రెడ్డి క్షమాపణలు కోరారు. క్షమాపణలు చెప్పిన తరువాత కూడా మాధవి మరో వీడియోను షేర్ చేసింది.
మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడినందుకు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది. మామూలుగా ఉందామని చాలా ప్రయత్నించా.. కానీ నా వల్ల కావడం లేదంటూ వాపోయింది. తెరమీద కనిపించే వాళ్లందరూ వ్యభిచారులేనంటు అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమని మాధవీలత ఆరోపించారు.