Keerthy suresh | కీర్తిసురేష్.. తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న నటి. ‘నేను శైలజా’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ కేరళ కుట్టి ‘రెమో’, ‘నేను లోకల్’ వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చిన ‘మహానటి’తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అంతేకాకుండా ఈ సినిమా కీర్తి సురేష్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తర్వాత హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేసింది. మహానటి తర్వాత వరుసగా ఈమె నటించిన సినిమాలన్ని ఫ్లాప్‌లుగా మిగిలాయి. మధ్యలో ‘సర్కార్’, ‘రంగ్‌దే’ యావరేజ్‌గా నిలిచాయి. దాంతో కీర్తి కెరీర్‌కు ముగింపు వచ్చినట్లే అని అందరూ భావించారు. ఈ క్రమంలో ‘సర్కారు వారి పాట’, ‘సాని కాదియం’ వంటి సినిమాలు వరుసగా హిట్లు కావడంతో కీర్తి తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఈమె నటించిన లేటెస్ట్ చిత్రం ‘వాషి’ నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్‌కు ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందట.
నాని హీరోగా సాయిపల్లవి, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. గతేడాది విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో సాయిపల్లవి నటించిన రోసీ పాత్రకు ప్రేక్షకుల నుండి గొప్ప ప్రశంసలు దక్కాయి. అయితే ఈ పాత్ర సాయిపల్లవి కంటే ముందు కీర్తి సురేష్ దగ్గరకు వెళ్ళిందట. కానీ అప్పటికే కీర్తి సురేష్ రజినీకాంత్ ‘అన్నాతే’లో నటిస్తుంది. శ్యామ్ సింగరాయ్కు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో రోసీ పాత్రను వదులుకుందట. ఇప్పటికి కీర్తి ఆ పాత్రను వదులుకున్నందుకు ఫీల్ అవుతుందట. ప్రస్తుతం కీర్తి చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో నానికి జోడీగా ‘దసరా’ సినిమాలో నటిస్తుంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోహీరోయిన్లు ఇద్దరూ డీ గ్లామర్ పాత్రల్లో నటిస్తున్నారు. దీనితో పాటు మెగాస్టార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భోళాశంకర్’లో కీర్తి చెల్లెలు పాత్రలో నటిస్తుంది.