పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమం ఐదో వసంతంలో దిగ్విజయంగా కొనసాగుతున్నది. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని పచ్చని ప్రకృతిని పెంచే యజ్ఞంలో భాగమవుతున్నారు. బుధవారం నటి కావ్య కళ్యాణ్‌రామ్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో భాగంగా జుబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ..‘మనకు స్వచ్ఛమైన ప్రాణవాయువు లభించాలంటే మొక్కలు నాటాలి. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటాలి’ అని చెప్పింది. అనంతరం తన కొత్త సినిమా ‘మసూద’ చిత్ర యూనిట్ సభ్యులకు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ విసిరింది.