ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. తాజాగా ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో సీమంతం వేడుక జరుపుకొంది. కాజల్ తల్లిదండ్రులతో పాటు భర్త గౌతమ్ కిచ్లూ, సోదరి నిషా అగర్వాల్, కొద్దిమంది బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారు. భర్త, సోదరి ముద్దాడగా కాజల్ ఫొటోలు దిగింది. ఈ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. దశాబ్దంన్నర కాలంగా దక్షిణాది అగ్రతారగా వెలిగిన కాజల్ గతేడాది అక్టోబర్ 30న స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలు తగ్గించి వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది. ఆమె చిరంజీవి సరసన నటించిన ‘ఆచార్య’ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.