Digangana Suryavanshi | ‘షో స్టాపర్’ దర్శక నిర్మాత మనీష్ హరిశంకర్ చేసిన ఆరోపణలను టాలీవుడ్ నటి దిగంగనా సూర్యవంశీ దిగంగనా సూర్యవంశీ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మేరకు పరువు నష్టం కింద నోటీసులను పంపుతూ.. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల డబ్బులు తీసుకొని మోసం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ మనీష్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై తాజాగా నటి స్పందించారు. మనీష్ చేసిన ఆరోపణలను కొట్టిపడేశారు. కేవలం అవన్నీ ఆయన వక్రీకృత ఊహేనని.. అందులో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది. తమపై ఆరోపణలు చేస్తూ చవకబారు పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనన్నారు.
ఆయన రెండు సంవత్సరాలు దాటినా వెబ్ సిరీస్‌ను విడుదల చేయలేకపోయారని.. ఈ విషయంలో మరింత వివరించేందుకు సమయం వృథా చేయదలచుకోలేనని స్పష్టం చేసింది. ఇప్పటికే మనీష్‌కు సహాయం చేసేందుకు చాలా సమయం వృథా చేశానని చెప్పింది. దిగంగనా తరఫు న్యాయవాది రాజేంద్ర మిశ్రా స్పందిస్తూ తన క్లయింట్‌పై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవన్నారు. మనీష్ తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మనీష్‌కు దిగంగనా ఏడు సంవత్సరాలుగా తెలుసునని.. ‘షో స్టాపర్’ సిరీస్ కోసం తన దిగంగనా సహాయం కోరాడని.. ఆయన బృందం ఓ వ్యాపార ఒప్పందాన్ని ప్రతిపాదించాడని.. ఇద్దరి మధ్య ఎంఓయూ సైతం కుదిరిందని చెప్పారు.
విచిత్రమేంటంటే.. మనీష్ హరిశంకర్‌కి చట్టబద్ధంగా దోపిడీ జరగదనే విషయం అర్థం కాలేదనని.. దాన్ని వ్యాపారం అంటారన్నారు. అయితే, షో స్టాపర్ ప్రాజెక్ట్ కోసం హీరో అక్షయ్ కుమార్‌తో పాటు ఆయన నిర్మాణ కంపెనీని ఈ సిరీస్ సమర్పకులుగా వ్యవహరించేందుకు ఒప్పిస్తానని దిగంగనా చెప్పిందని.. అక్షయ్ కుమార్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితర హీరోలతో పరిచయాలు ఉన్నాయని.. ఈ ప్రాజెక్టులో వారిని సైతం భాగం చేస్తానని నమ్మించిందని.. చివరకు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని మోసం చేసిందని ఎంహెచ్ ఫిలిమ్స్ బ్యానర్ సంస్థ ఆరోపించింది.
తన డిమాండ్లను నెరవేర్చకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరింపులకు పాల్పడినట్లు మనీష్ న్యాయవాది ఆరోపించారు. షో స్టాపర్ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని.. మేకర్స్ సరిగ్గా పేమెంట్స్ ఇవ్వండం లేదని తమపై అసత్య ఆరోపణలు చేసి తమ బ్యానర్ ప్రతిష్ట దిగజార్చారని నటుడు రాకేశ్ బేడీ, దిగంగన సూర్యవంశీ ఫ్యాషన్ డిజైనర్ కృష్ణన్ పార్మర్పై సైతం పరువు నష్టం దావా వేశారు. ఇదిలా ఉండగా.. షో స్టాపర్ సిరీస్‌లో జీనత్ అమన్ జరీనా వాహబ్, శ్వేత తివారీ, దిగంగనా సూర్యవంశీ, సౌరభ్ రాజ్ జైన్ కీలక పాత్రల్లో నటించారు. ఇక దిగంగనా తెలుగులో సిటీమార్, క్రేజీఫెలో, హిప్పి, వలయం చిత్రాల్లో మెరిసింది.