Tirumala | కలియుగ దైవం తిరుమల శ్రీవారిని నటి అంజలి, నటుడు శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వీరిద్దరూ కలిసి స్వామివారి దివ్య దర్శనంలో పాల్గొన్నారు. దర్శనం పూర్తయిన తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనాలు అందించి స్వామివారి పవిత్ర తీర్థం ప్రసాదాలు సమర్పించారు. ‘గీతాంజలి’, ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ వంటి సూపర్‌హిట్ చిత్రాలతో నటి అంజలి, నటుడు శ్రీనివాస్‌రెడ్డి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే.