Actress Aishwarya | పెళ్లి పేరుతో భర్తను మోసం చేసిన నటి ఐశ్వర్య.. న్యాయం చేయాలని భర్త వేడుకోలు..
Actress Aishwarya | పెళ్లి పేరుతో ప్రముఖ టీవీ సీనియర్ నటి ఐశ్వర్య అడ్డాల తనను మోసం చేసిందని ఆమె భర్త శ్యామ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను పెళ్లి చేసుకొని డబ్బంతా కాజేసిందని.. ఇప్పుడు విడాకుల పేరుతో మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుందని వాపోయాడు.
Actress Aishwarya | పెళ్లి పేరుతో ప్రముఖ టీవీ సీనియర్ నటి ఐశ్వర్య అడ్డాల తనను మోసం చేసిందని ఆమె భర్త శ్యామ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను పెళ్లి చేసుకొని డబ్బంతా కాజేసిందని.. ఇప్పుడు విడాకుల పేరుతో మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుందని వాపోయాడు. వేధింపులను భరించలేకపోతున్నానంటూ చెప్పాడు. పిన్నింటి శ్యామ్ కుమార్, టీవీ నటి ఐశ్వర్య అడ్డాలకు 2023, సెప్టెంబర్ 6న పెళ్లయ్యింది. ఓ మ్యాట్రిమోనీ ద్వారా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల పాటు కాపురం సజావుగానే సాగగా.. ఆ తర్వాత గొడవలు షురూ అయ్యాయి.
అయితే, పెళ్లయిన నెల రోజులకే తన భార్య హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ రమేశ్‌బాబుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని శ్యామ్‌కుమార్ ఆరోపించారు. వ్యవహారంపై ప్రశ్నిస్తే తనపైనే అక్రమంగా కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లయిన నాటి నుంచి తన వద్ద మొత్తం రూ.25లక్షల వరకు లూటీ చేసిందని.. ఇప్పుడు విడాకులు కావాలంటూ తనతో పాటు కుటుంబాన్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుందని వాపోయాడు. తనకు న్యాయం చేయాలని శ్యామ్ కుమార్ మీడియాను కోరారు.
ఈ సందర్భంగా రమేశ్ బాబు వీడియో కాల్స్ వివరాలను సైతం బయటపెట్టాడు. ఆ వీడియోలో ఐశ్వర్య, రమేశ్‌బాబు మాట్లాడుకోవడం కనిపించింది. వీటితో శ్యామ్ తరఫు లాయర్‌ను సైతం బెదిరింపులకు గురి చేసిన ఆడియో కాల్స్ సైతం బయటకు వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలపై ఐశ్యర్య ఇప్పటి వరకు స్పందించలేదు. ఐశ్వర్య టీవీ సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో కనిపించింది. అమ్మాయి గారు, పలుకే బంగారామాయేనా, అలా వైకుంఠపురం సీరియల్స్‌లో నటించింది. సూపర్ హిట్ గ్యారెంటీ, నీ రూటే సెపరేటు, త్రిముఖి సినిమాల్లోనూ హీరోయిన్గా కనిపించింది.
మ్యాట్రిమోని ద్వారా యువకుడిని మోసం చేసిన ప్రముఖ సీరియల్ నటి..
పిన్నింటి శ్యాంకుమార్, అడ్డాల ఐశ్వర్య అనే ఇద్దరికీ మాట్రిమోనీ ద్వారా పరిచయం ఏర్పడింది, ఇరువురికి నచ్చడంతో గత ఎడాది సెప్టెంబర్ 6న వివాహం చేసుకున్నారు.
ఆ తర్వాత ఇద్దరు కలిసి హైదరాబాద్ వెళ్లగా కొన్ని రోజులకే ఆమె నిజ… pic.twitter.com/b7ZLIxOBxB
— Telugu Scribe (@TeluguScribe) March 11, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

