ముంబై : బాలీవుడ్ నటులు కరీనా కపూర్ ఖాన్, అమృతా అరోరాకు కరోనా వైరస్ సంక్రమించింది. కోవిడ్ పరీక్షలో వాళ్లు పాజిటివ్‌గా తేలారు. ఇద్దరూ కోవిడ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ఆ ఇద్దరూ పలు పార్టీలకు హాజరయ్యారు. ఈ ఇద్దరు నటులతో కాంటాక్ట్‌లోకి వచ్చిన వాళ్లందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని బీఎంసీ సూచించింది. అందరూ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కోరింది. అయితే కరీనా, అమృతాకు సోకింది ఒమిక్రాన్ వేరియంట్ అవునా కాదా అన్న విషయం ఇంకా తెలియదు.