Actor | ఈ మధ్య సెలబ్రిటీల మరణ వార్తలకి సంబంధించి ఎక్కువగా వార్తలు వింటున్నాం. అనారోగ్యంతో కన్ను మూస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు విష్ణు ప్రసాద్ లివర్ సంబంధిత సమస్యలతో కన్నుమూసారు. ఆయన కొంత కాలంగా లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతుండగా, ఆయనని చికిత్స కోసం కేరళలోని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే శుక్రవారం ఉదయం విష్ణు ప్రసాద్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కో యాక్టర్ సత్య తెలియజేశారు. ఆమె విష్ణు ప్రసాద్ అనారోగ్య సమస్యల గురించి తెలియజేస్తూ అతని కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
విష్ణు ప్రసాద్.. బుల్లితెర, వెండితెరపై అలరించారు. అయితే కొద్ది నెలల క్రితం అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యులని సంప్రదిస్తే లివర్ సమస్యలు ఉన్నట్టు తేలింది.వెంటనే కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే వైద్యులు విష్ణుకి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమని తెలిపారు. సర్జరీకి దాదాపు రూ.30 లక్షల మేర అవసరం అవుతుందని చెప్పగా, విష్ణు ప్రసాద్ కుటుంబం, మలయాళ టీవీ యాక్టర్స్ సంఘంతో కలిసి నిధులు సేకరించే ఏర్పాట్లు చేశారు. పలువురిని ఆర్ధిక సాయం అందించాలని అభ్యర్ధించారు.
విష్ణు కుమార్తెల్లో ఒకరు లివర్ డొనేట్ చేసేందుకు కూడా ముందుకొచ్చారు. డబ్బు సేకరించే లోపే విష్ణు ప్రసాద్ కన్నుమూశారు. ఆయనకు భార్య.. ఇద్దరు కుమార్తెలు అభిరామి, అననిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విష్ణు మృతితో మలయాళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. విష్ణు ప్రసాద్ ‘కైయేతుమ్ దూరత్’, ‘కాశీ’, ‘మాంబఝక్కలం’, ‘బెన్ జాన్సన్’, ‘లోకనాథన్ IAS’, ‘లయన్’ సినిమాల్లో నటించారు. ఇక పలు సీరియళ్లలోనూ విలన్ రోల్స్‌లో నటించి ప్రేక్షకాదరణ పొందారు. విష్ణు మరణించిన వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు.