‘జవాన్’తో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీని సృష్టించాడు దర్శకుడు అట్లీ. మరి నెక్ట్స్ అట్లీ సినిమా ఎవరితో ఉంటుంది? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. సల్మాన్, విజయ్ కాంబినేషన్లో మల్టీస్టారర్ చేయబోతున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. అయితే.. విజయ్ పాలిటిక్స్ ఎంట్రీతో ఆ సినిమా లేనట్టే అని తేలిపోయింది. మరి నెక్ట్స్ ఏంటి? అని అంతా అనుకుంటున్న తరుణంలో..
ఓ అద్భుతమైన అప్డేట్ ఇచ్చేశాడు అట్లీ. ప్రస్తుతం తన తాజా సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నదని, ఈ సినిమాలో స్టార్స్‌ని చూసి అంతా ఆశ్చర్యపోతారని, అవుటాఫ్ ది వరల్డ్ ఐడియాతో ఈ సారి సినిమా చేస్తున్నానని అట్లీ చెప్పుకొచ్చారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా ఈ సినిమా ఉండబోతున్నదట. ఇందులో ఏకంగా నలుగురు స్టార్లు నటించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. వారిలో తెలుగు నుంచి కూడా ఓ ప్రముఖ హీరో నటించనున్నట్టు తెలుస్తున్నది.