Vijay Devarakonda | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుండగా విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా వస్తుండగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా కేరళలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.
అయితే ఈ మూవీ షూటింగ్ అనంతరం ఖాళీ సమయంలో కేరళను చుట్టివస్తున్నాడు ఈ రౌడీ హీరో. కేరళలోని టీ తోటల (Kerala Tea Estates) మధ్య ఉదయాన్నే జాగింగ్ చేస్తున్న వీడియోలను విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ వీడియోలో రౌడి హీరో జాగింగ్ చేయడం.. అతడిని చూసిన ఫారెస్ట్ అధికారులు అతడితో ఫొటోలు దిగడం. కొండ అంచున నిలబడి సేద తీరడం.. అలాగే తాను జాగింగ్ చేసిన రూట్ మ్యాప్ .. అక్కడి వెదర్‌ను బట్టి తన హార్ట్ బీట్ ఎలా మారుతుందో లాంటి విషయాలను పంచుకున్నాడు విజయ్. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
VD12గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించబోతున్నట్లు టాక్. కాగా దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ తెరకెక్కిస్తున్నది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు.