Vaishnav Tej Next Flim | మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. డెబ్యూ సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించాడు. స్టార్ హీరోల రేంజ్లో కలెక్షన్లను సాధించి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఈ చిత్రం తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ చిత్రాన్ని చేశాడు. గతేడాది అక్టోబర్‌లో విడుదలైన ఈ చిత్రం రూ.10 కోట్ల కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయింది. రెండవ సినిమా ఫలితం వైష్ణవ్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం ఈయన శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
అయితే ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ నిర్మించనున్నాడట. త్రివిక్రమ్ సొంత బ్యానర్ అయిన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై, సితార ఎంటర్టైనమెంట్స్తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నాడని టాక్. త్వరలోనే దీనిపై అధికారకంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో ‘పెళ్ళి సందD’ ఫేం శ్రీలీలా హీరోయిన్గా నటించనుందని సమాచారం. ఇక ప్రస్తుతం వైష్ణవ్ నటించిన ‘రంగ రంగ వైభవంగా’ విడుదలకు సిద్ధంగా ఉంది. గిరీశయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రాన్ని జూలై 1న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఈ చిత్రంపై ఎలాంటి బజ్ లేదు. చిత్రం నుంచి కూడా గత కొన్ని రోజుల నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేవు. మరి ఈ చిత్రాన్ని వాయిదా వేస్తారా? లేదంటే అదే రోజున విడుదల చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.