Actor Srikanth | భక్తుల కొంగుబంగారం అయిన కొండగట్టు అంజన్నను టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న శ్రీకాంత్‌కు అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి శ్రీకాంత్ ప్రత్యేకపూజలు చేశారు.
పూజానంతరం వేదపండితులు నటుడికి ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు వేములవాడ రాజన్నను శ్రీకాంత్ వేకువజామునే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇక శ్రీకాంత్ కొండగట్టు రావాడంతో అతడిని చూడడానికి భక్తులు ఎగబడ్డారు.