Nayattu Remake | మలయాళ అణిముత్యాల్లో నాయట్టు ఒకటి. పొలిటికల్ సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో బంపర్ హిట్. రెండేళ్ల కిందటే ఈ సినిమా హక్కులను అల్లు అరవింద్ కొనుగోలు చేశాడు. ముందుగా డబ్బింగ్ చేసి ఆహాలో స్ట్రీమింగ్ చేద్దామనుకున్నాడు. కానీ కంటెంట్ వైజ్‌గా ఇదో అద్భుతమైన సినిమా అని భావించి, రీమేక్ ప్లాన్‌లో పడ్డాడు. పెద్ద స్టార్లతో గ్రాండియర్‌గా సినిమా తీయాలని ప్లాన్ చేశాడు. కానీ అది కుదరలేదు. దాంతో నటుడు శ్రీకాంత్‌ను ప్రధాన పాత్రలో పెట్టి తీశాడు. జోహార్, అర్జున ఫల్గుణ సినిమాలు చేసిన తేజ మార్ని ఈ సినిమాకు దర్శకుడు. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సినిమాకు కోట బొమ్మాళి P.S అనే పేరును ఫిక్స్ చేశారు. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనుంది. పేరుకు మలయాళ సినిమానే అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్లు భారీ మార్పులు చేసినట్లు ఇన్సైడ్ టాక్. ఇక ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోనే సినిమాపై మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్నారు. మూడు సింహాలున్న ఐడల్‌ను చైన్స్‌తో బంధించి ఎలక్షన్ బ్యాలెట్ పేపర్ కాలిపోతున్న చూపించిన పోస్టర్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఆ పేపర్‌పై శ్రీకాంత్, విజయ్, శివాని ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తున్నట్లు చూపించారు.
పోస్టర్‌తోనే మంచి ఆసక్తి క్రియేట్ చేసిన ఈ సినిమాను మలయాళంలో చార్లీ దర్శకుడు మార్టిన్ ప్రక్కట్ తెరకెక్కించాడు. తాము చేయని హత్య కేసులో ముగ్గురు పోలీసు అధికారులు చిక్కుకుంటారు. ఈ కేసు నుంచి వాళ్లు బయటపడతారా? లేదా? చివరకు వాళ్ల జీవితం ఎలా మారింది? అనే కథాంశం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ఇదే కథకు పొలిటిలికల్ టచ్ అప్ ఇచ్చి సినిమాను వేరే లెవల్‌కు తీసుకెళ్లాడు దర్శకుడు మార్టిన్. ఇక ఇప్పుడు తెలుగులో ఈ సినిమా రీమేక్ కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పైగా శ్రీకాకుళంలో ఓ ఊరి పేరైన కోట బొమ్మాళి పేరు పెట్టడం విశేషం. గీతాఆర్ట్స్-2 బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఇదే ఏడాది రిలీజ్ కానుంది.
A Story that you all need to know! 💥
A Riveting Drama you will never forget ❤️🔥
Here’s the Highly Intense First Look Motion Poster of #KotaBommaliPS ⛓️🦁🔥
– https://t.co/rQcmVNTVyX@actorsrikanth #BunnyVass #VidyaKoppineedi @DirTejaMarni @varusarath5 @bhanu_pratapa… pic.twitter.com/ZKp2qS2Buv
— Geetha Arts (@GeethaArts) July 31, 2023