Sonu Sood | బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మరోసారి తన ధైర్య సాహసాలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయన నివసిస్తున్న ముంబైలోని సొసైటీ ఆవరణలోకి ఓ పాము ప్రవేశించడంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. అయితే సోనూ సూద్ మాత్రం భయం లేకుండా స్వయంగా రంగంలోకి దిగి, ఆ పామును తన చేతులతో పట్టుకుని సురక్షితంగా ఓ సంచిలో వేశారు.
సోనూ సూద్ పట్టుకున్నది విషరహితమైన ర్యాట్ స్నేక్ (జెర్రిపోతు) అని తెలిసింది. ఈ సంఘటన అనంతరం ఆయన ఒక ముఖ్యమైన సందేశాన్నిచ్చారు సోనూ. సాధారణ ప్రజలు పాములను పట్టుకునే ప్రయత్నం చేయవద్దని, ఇళ్లలోకి పాములు వస్తే వెంటనే నిపుణులను సంప్రదించి, వాటిని హింసించకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోనూ సూద్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా, అది క్షణాల్లో వైరల్ అయ్యింది. ఆయన ధైర్యానికి, అలాగే నిస్సహాయ ప్రాణుల పట్ల ఆయన చూపిన దయకు నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.
Sonu Sood ਨੇ ਸੱਪ ਨੂੰ ਫੁਰਤੀ ਨਾਲ ਫੜਿਆ, ਬੋਰੀ ਵਿੱਚ ਪਾਇਆ ਤੇ ਦਿੱਤਾ ਖਾਸ ਸੰਦੇਸ਼ !#ptcnews #sonusood #snake pic.twitter.com/IZeiJU1OMc
— ਪੀਟੀਸੀ ਨਿਊਜ਼ | PTC News (@ptcnews) July 19, 2025