Simbu | తమిళ హీరో శింబుకి పాటలు పాడటంలో కూడా చక్కటి ప్రావీణ్యం ఉన్న విషయం తెలిసిందే. తమిళ, తెలుగు భాషల్లో ఆయన ఇప్పటికే తనదైన గాత్రంతో సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన పవన్‌కల్యాణ్ ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) చిత్రంలో ఓ పాటను ఆలపించారు. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు తమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఓజీ’ చిత్రంలో శింబు పాట పాడనున్నారని గతంలోనే వార్తలొచ్చాయి. తాజాగా తమన్ ప్రకటనతో అది నిజమని రుజువైంది.
‘ఫైర్ స్ట్రామ్’ పేరుతో కంపోజ్ చేసిన ఈ పాటకు శింబు వాయిస్ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. ‘ఓజీ’ సినిమా షూటింగ్ పునఃప్రారంభమైన తర్వాత ఈ పాటను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్, ఇమ్రాన్ హష్మీ, అర్జున్‌దాస్, ప్రకాష్‌రాజ్ తదితరులు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఇంకా కొంతభాగం చిత్రీకరణ మిగిలి వుంది. రాజకీయ కార్యకలాపాలకు కాస్త విరామం ప్రకటించి త్వరలో ఈ సినిమా షూట్లో పవన్‌కల్యాణ్ జాయిన్ అయ్యే అవకాశాలున్నాయని తెలిసింది.