Oke Oka Jeevitham Movie Story Line | యువ హీరో శర్వానంద్‌ను కొన్నేళ్ళుగా వరుసగా ఫ్లాప్‌లు వెంటబడుతున్నాయి. ఇటీవలే భారీ అంచనాల నుడమ విడుదలైన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. నిజానికి ఈయన నటించిన గత ఆరు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయ్యాయి. దీంతో శర్వా తన కెరీర్‌కు బూస్ట్ ఇచ్చే ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘ఓకే ఒక జీవితం’ చిత్రంపైనా ఉన్నాయి. శ్రీకార్తిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ప్రస్తుతం చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీగా గడుపుతున్నారు.
ఇక ప్రమోషన్లో భాగంగా మేకర్స్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ సినిమాపై మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు. కాగా తాజాగా శర్వానంద్ ఓ ఇంటర్వూలో భాగంగా సినిమా స్టోరీ లైన్‌ను చెప్పాడు. ‘ఇది ఒక టైం ట్రావెల్ కథ అని, ఓ కుర్రాడు కాలంలో వెనక్కు వెళ్లి తన తల్లిని కలుసుకోవడం, మరో కుర్రాడు తనకు నో చెప్పిన అమ్మాయిలను కలుసుకోవడం ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కినట్లు’ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రేక్షకులలో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో శర్వాకు జోడీగా రీతూవర్మ హీరోయిన్గా నటించింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని అమల కీలకపాత్రలో నటించింది. వెన్నెలకిషోర్, ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటించారు.