Sharwanand | ముఖ్యమంత్రి కేసీఆర్కు శర్వానంద్ ఆహ్వానం
Sharwanand | యువ హీరో శర్వానంద్ (Sharwanand)-రక్షితారెడ్డి (Sharwa Rakshita) జూన్ 3 (శనివారం)న శర్వానంద్-వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా శర్వానంద్ ఫ్యామిలీ జూన్ 9న హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో శర్వానంద్ ముఖ్యమంత్రి కేసీఆర్ (CMKCR)ను కలిశారు.
Sharwanand | టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand) ఇటీవలే ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. జూన్ 3 (శనివారం)న శర్వానంద్-రక్షితారెడ్డి (Sharwa Rakshita) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా శర్వానంద్ ఫ్యామిలీ జూన్ 9న హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో శర్వానంద్ ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ (CMKCR)ను కలిశారు. రిసెప్షన్కు రావాలని సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందించారు శర్వానంద్.
శర్వానంద్ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్తో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ ఫొటోలు, వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. జైపూర్లోని లీలా ప్యాలెస్లో కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో రెండు రోజులపాటు జరిగిన శర్వానంద్ పెళ్లి వేడుకకు టాలీవుడ్ యాక్టర్లు రాంచరణ్, సిద్దార్థ్, అదితీరావు హైదరీతోపాటు ఇతర నటీనటులు, సినీ ప్రముఖులు హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు.
శర్వానంద్ సతీమణి రక్షితారెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. శర్వానంద్ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీలో రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.

Cmkcr
Hero #Sharwanand met Hon’ble Chief Minister of Telangana Shri. #KCR Garu and invited him for the wedding reception to be held grandly on June 9th in Hyderabad. @ImSharwanand pic.twitter.com/2s0wIJ5B0g
— Suresh PRO (@SureshPRO_) June 8, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

