Sarath Babu | సీనియర్ నటుడు శరత్‌బాబు కన్నుమూత
Actor Sarath Babu Passes away | సీనియర్ నటుడు శరత్‌బాబు(71) మరణించాడు. గతకొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో భాదపడుతన్న శరత్‌బాబు కొద్ది సేపటి క్రితం మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Actor Sarath Babu Passes away | సీనియర్ నటుడు శరత్‌బాబు(71) కన్నుముశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో భాదపడుతన్న శరత్‌బాబు కొద్ది సేపటి క్రితం మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శరత్ బాబు గత నెల రోజులగా ఏఐజీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం ఉదయం నుంచి ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. మృత్యువుతో పోరాడి చివరకు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో తుది శ్వాస విడిచారు.
1973లో ‘రామరాజ్యం’ అనే సినిమాతో శరత్‌బాబు వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత మూడేళ్లకు ‘రాజా’ సినిమాలో అడ్వకేట్ రాము పాత్రలో నటించారు. ఈ సినిమా శరత్‌బాబుకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాంతో అవకాశాలు క్యూ కట్టాయి. అప్పుడే కే. బాలచందర్.. శరత్‌బాబును చూసి తను డైరెక్ట్ చేస్తున్న ‘పట్టిన ప్రవేశం’ అనే తమిళ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కూడా శరత్‌బాబుకు తమిళ్లో మంచి క్రేజ్ పెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో తెగ బిజీ అయిపోయారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా గడిపేవారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించాడు.
కెరీర్ మొదట్లో ఏడాదికి పది, పదిహేను సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవారు. ఇక తెలుగులో శరత్‌బాబు చివరగా ‘వకీల్‌సాబ్’ సినిమా చేశారు. ఈ సినిమాలో శరత్‌బాబు డిసిప్లైన్ కమిటీ చైర్మన్ పాత్రలో నటించారు. ఇక ప్రస్తుతం ఆయన నటించిన ‘మళ్లీ పెళ్లి’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా శరత్‌బాబు చెదిరిపోని ముద్ర వేసుకున్నాడు. ముఖ్యంగా ఈటివీలో 1977లో వచ్చిన ‘అంతరంగాలు’ సీరియల్ శరత్‌బాబును బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఆ తర్వాత ‘జనని’, ‘అగ్నిగుండాలు’ సీరియల్స్ కూడా శరత్‌బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

