Sai Dharam-Swathi | సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి మధ్య అంత మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉందా..!
Sai Dharam-Swathi | మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి కలిసి మొన్నా మధ్య సత్య అంటూ ఓ చిన్న షార్ట్ ఫిలింలో కనిపించారు. కాగా మంగళవారం కలర్స్ స్వాతి నటించిన 'మంత్ ఆఫ్ మధు' ట్రైలర్ ఈవెంట్‌కు తేజు గెస్ట్‌గా వచ్చాడు.
Sai Dharam-Swathi | మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి కలిసి మొన్నా మధ్య సత్య అంటూ ఓ చిన్న షార్ట్ ఫిలింలో కనిపించారు. కాగా మంగళవారం కలర్స్ స్వాతి నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ ట్రైలర్ ఈవెంట్‌కు తేజు గెస్ట్‌గా వచ్చాడు. ఇక అక్కడికి వచ్చిన మీడియాతో పాటు ఈవెంట్ చూసిన ప్రతీ ఒక్కరు తేజు, స్వాతి బాండింగ్ చూసి షాకయ్యారు. ఎంత బాండింగ్ అంటే తేజును స్వాతి రేయ్, వాడు అంటూ సంభోదించింది. ఇది చూసిన జనాలందరూ ఏంటి ఒక్క షార్ట్ ఫిలింకే ఇంత క్లోజ్ అయిపోయారా అని ఆశ్చర్యంలో మునిగిపోయారు. అయితే ఇక్కడ అసలు విషయం అది కాదట.
తేజు, కలర్స్ స్వాతి డిగ్రీలో క్లాస్మేట్స్ అంట. ఈ విషయాన్ని స్వాతినే స్వయంగా చెప్పుకొచ్చింది. అందరూ తనను తేజు కంటే పెద్ద అనుకుంటారు కానీ.. ఇండస్ట్రీకి తాను తొందరగా రావడం వల్ల అలా అనిపిస్తుందని తెలిపింది. ఇక తేజ ఎప్పుడూ తన పేపర్లో చూసి కాపీ కొట్టేవాడని, అలానే పాసయ్యేవాడని చెప్పుకొచ్చింది. ఇద్దరూ పేర్లు S లెటర్‌తో స్టార్ట్ అవడం వల్ల ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌లో పక్క పక్కనే పడేవాళ్లమని తెలిపింది. తేజ తనకు జీవితంలో చాలా ముఖ్యమైన ఫ్రెండ్ అని, తనకెంతో సపోర్ట్‌గా నిలిచాడని స్వాతి వెల్లడించింది.
ఇక తేజ కూడా మైక్ తీసుకుని కలర్స్ స్వాతి తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని పరీక్షల్లో అస్సలు చూపించేది కాదని, ల్యాబ్‌లో మొత్తం చూపించేసి చివర్లో రిజల్ట్ చెప్పేది కాదని సరదాగా చెప్పుకొచ్చాడు. ఇక వీళ్ల మధ్య బాండింగ్ చూసిన వారందరూ ఒక్క సారిగా షాకయ్యారు. ఇంత క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉన్నా.. ఇప్పటివరకు వీళ్ల ఫ్రెండ్షిప్ బయట పడక పోవడం గమనార్హం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

