Actor Ravi Teja’s father Passed Away | టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాస్ మహారాజా రవితేజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి భూపతిరాజు రాజగోపాల్ రాజు (90) కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం (జూలై 15) రాత్రి హైదరాబాద్లోని రవితేజ నివాసంలో తుదిశ్వాస విడిచారు. రాజగోపాల్ రాజు మృతితో రవితేజ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన అంత్యక్రియలు బుధవారం జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజగోపాల్ రాజు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు, రవితేజ అభిమానులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఎక్స్ వేదికగా తన సంతాపం ప్రకటించారు.
సోదరుడు రవి తేజ నాన్నగారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. అయన్ని ఆఖరిసారిగా వాల్తేర్ వీరయ్య సెట్లోకలిశాను. చాలా సరదాగా హుషారుగా మాట్లాడేవారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అంటూ చిరు రాసుకోచ్చాడు.
రాజగోపాల్ రాజుకు రవితేజతో పాటు రఘు, భరత్ రాజు అనే మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. 2017లో జరిగిన కారు ప్రమాదంలో భరత్ రాజు మరణించిన సంగతి తెలిసిందే. రాజగోపాల్ రాజు స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని జగ్గంపేట. ఉద్యోగరీత్యా పలు ప్రాంతాల్లో పనిచేయడం వల్ల రవితేజకు వివిధ యాసలు అలవడ్డాయని చెబుతుంటారు. ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కోట శ్రీనివాసరావు, బి. సరోజా దేవి వంటి ప్రముఖులు కన్నుమూయగా, ఇప్పుడు రవితేజ తండ్రి మరణ వార్త సినీ లోకాన్ని మరింత విషాదంలోకి నెట్టింది.
సోదరుడు రవి తేజ నాన్నగారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. అయన్ని ఆఖరిసారిగా వాల్తేర్ వీరయ్య సెట్లోకలిశాను. చాలా సరదాగా హుషారుగా మాట్లాడేవారు.
ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🙏 pic.twitter.com/uLbwQ32nPJ
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2025