శివకుమార్, పాటినీకుమార్, గాయత్రి నాయకానాయికలుగా నటిస్తున్న సినిమా ‘టేక్ డైవర్షన్’. రామచంద్రన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మద్దాల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ మద్దాల, చందు మద్దాల, వెంకట్ మద్దాల నిర్మిస్తున్నారు. శివానీ సెంథిల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్లో జరిగింది. ‘ట్రైలర్ బాగుంది, అన్నదమ్ములు కలిసి నిర్మించిన ఈ సినిమాకు విజయం దక్కాలి’ అన్నారు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత లగడపాటి శ్రీధర్. నిర్మాత చందు మద్దాల మాట్లాడుతూ…‘తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’ అని తెలిపారు.