Shivani Rajashekar | టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చి తనకంటూ పత్యేక గుర్తింపును ఏర్పరచుకుంటున్న నటి శివాని. ఇటీవలే ‘అద్భుతం’ సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5లో నేరుగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. శివాని నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియలో షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటుంది. తాజాగా ఈమె ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలకు ఎంపికైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియజేసింది.
మీ అందరి ఆశీర్వాదాలు మరియు ప్రేమను కోరుకుంటూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. అవకాశం ఇచ్చిన ఫెమినా మిస్ ఇండియా ఆర్గనైజేషన్‌కు ధన్యవాదాలు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో పలువురు సినీప్రముఖులు, నెటీజన్లు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ప్రస్తుతం ఈవిడ టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనే నటిస్తుంది. ‘అన్బరివు’ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం తెలుగులో ఈమె చేతిలో రెండు సినిమాలన్నాయి.