Sunita Williams | కేరళలోని కోజికోడ్‌లో జరుగుతున్న సాహిత్య ఉత్సవం (KLF 2026) ఒక అపురూప ఘట్టానికి వేదికైంది. భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను దిగ్గజ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా కలుసుకున్నాడు. ప్రస్తుతం కేరళలో లిటరేచర్ ఫెస్టివల్ జరుగుతుండగా.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చింది సునీత విలియమ్స్. అయితే ఇటీవలే నాసా నుంచి పదవీ విరమణ పొంది భారత పర్యటనకు వచ్చిన సునీతా విలియమ్స్‌తో గడిపిన క్షణాలను ప్రకాశ్ రాజ్ తన సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ జనరేషన్ అత్యంత ధైర్యవంతురాలైన మహిళను కలవడం తనకు దక్కిన గొప్ప గౌరవమని, ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయని ప్రకాశ్‌రాజ్ ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
What a moment to cherish …. to meet .. to have conversed with such a courageous woman of our times .. #SunithaWilliams at #KLF … sharing with you all my over the moon memories ❤️❤️❤️ pic.twitter.com/YN5JfyP9Tt
— Prakash Raj (@prakashraaj) January 22, 2026