Yellamma Movie Nithiin | ఎల్లమ్మ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు నటుడు నితిన్(Nithiin). తన కెరీర్లో జయం తర్వాత మళ్లీ అలాంటి సినిమా చేయబోతున్నానంటూ చెప్పుకోచ్చాడు. నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood). ఈ సినిమాకు వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్నాడు. భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గోన్న నితిన్ తాజాగా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ఎల్లమ్మ గురించి పంచుకున్నాడు.
ఎల్లమ్మ గురించి మాట్లాడుతూ.. ఎల్లమ్మ నా కెరీర్ లో జయం తర్వాత అంతకంటే లోకల్ రూటెడ్(గ్రామీణ నేపథ్యంలో) సినిమాగా రాబోతుంది. నేను ఎంత బాగా యాక్టింగ్ చేస్తే నాకు అంత పేరు వస్తుంది. ఇదోక మైల్ స్టోన్ సినిమా అని చెప్పవచ్చు. ఎల్లమ్మ అనే గ్రామ దేవత నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందంటూ నితిన్ చెప్పుకోచ్చాడు. ఈ సినిమాకు బలగం దర్శకుడు వేణు ఎల్దండి దర్శకత్వం వహించబోతుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించబోతున్నాడు. సాయి పల్లవిని మొదటగా ఈ సినిమాకు కథానాయికగా అనుకోగా తాజాగా ఆమె తప్పుకున్నట్లు తెలుస్తుంది.