Nikhil Sidharth | వారం కింద రిలీజైన స్పై సినిమా నిఖిల్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. అంతేకాకుండా ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ప్రాఫిట్ వెంచర్లోకి అడుగుపెట్టింది. రిలీజ్ రోజును ఫుల్ నెగెటీవ్ రివ్యూలు తెచ్చుకున్నా.. టాక్‌తో సంబంధంలేకుండా కలెక్షన్లు సాధిస్తూ వస్తుంది. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌నే చాలా హడావిడిగా ప్రకటించారు. దానికి తగ్గట్లు ప్రమోషన్లు కూడా స్పీడ్ స్పీడ్‌గా చేశారు. నిజానికి ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలని గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ అది సాధ్యపడలేదు. అంతే కాదు కంటెంట్ సరైన సమయానికి చేరకపోవడం వల్ల ఓవర్సీస్ ప్రీమియర్లు క్యాన్సిల్ అయ్యాయి.
కాగా దీనిపై నిఖిల్ తాజాగా ట్విట్టర్లో ఓ లేఖను పంచుకున్నాడు. ‘నా కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ వచ్చేలా చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా మీద ఉంచిన నమ్మకానికి ఎంతో సంతోషంగా ఉంది. కానీ అన్ని భాషల్లో విడుదల చేయడంలో మా బృందం విఫలమైనందుకు బాధగా ఉంది. దేశవ్యాప్తంగా కాంట్రాక్టు, కంటెంట్ డిలే వల్ల షోలు రద్దయ్యాయి. ఓవర్సీస్ లోనూ 350 ప్రీమియర్లు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. హిందీ, కన్నడ, మలయాళం, తమిళ ప్రేక్షకులను ఈ విషయంగా క్షమాపణ కోరుతున్నాను. నా రాబోయే మూడు సినిమాలు టైం ప్రకారం అన్నీ పక్కాగా సిద్ధం చేసుకుని అన్ని భాషల్లో రిలీజవుతాయి. ప్రతి తెలుగు సినిమా అభిమానికి ఇకపై నాణ్యత విషయంలో ఎంత ఒత్తిడి వచ్చినా రాజీ పడనని తెలియజేస్తున్నాను. ప్రతిదీ చెక్ చేసుకుని, పూర్తి సంసిద్ధంగా సినిమా తయారైనప్పుడే మీ ముందుకు వస్తానంటూ’ లేఖలో పేర్కొన్నాడు.
Straight from the Heart ❤️💔❤️🩹
A Promise from me to Every Cinema Loving Audience… #SpyMovie #Spy pic.twitter.com/SZfV9N4m4G— Nikhil Siddhartha (@actor_Nikhil) July 5, 2023
మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా మారాడు. అయితే కథకుడిగా వంద మార్కులు కొట్టేసిన గ్యారీ.. కథనంలో మాత్రం పట్టుతప్పాడు. 1945లో ప్లయిన్ క్రాష్ లో అంతర్ధానమైన సుభాష్ చంద్ర బోస్ మిస్టరీ మరణం చుట్టూ ఈ సినిమా తిరుగుతందని టీజర్, ట్రైలర్‌తోనే స్పష్టం చేశాడు. కానీ దాన్ని తెరపై చూపించడంలో కాస్త తడపడ్డాడు. నిఖిల్‌కు జోడీగా సాన్య థాకూర్, ఐశ్వర్య మీనన్‌లు నటించారు.