Naresh-Pavitra Wedding Video | ఐదేళ్ల క్రితం వచ్చిన ‘సమ్మోహనం’ సినిమాలో తొలిసారి భార్య, భర్తలుగా నటించారు నరేష్, పవిత్ర. ఇక అప్పటి నుంచి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ షికారు చేశాయి. ఇక కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ డిసెంబర్ 31న ఈ ఇద్దరూ కలిసి లిప్‌కిస్ చేసుకున్న వీడియోను రిలీజ్ చేసి ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చేశారు. ఆ వీడియోను పోస్ట్ చేస్తూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ అప్పట్లో వెల్లడించారు. దాంతో ఆ వీడియో క్షణాల్లోనే తెగ వైరల్ అయింది. అయితే అది వీళ్లద్దరూ కలిసి నటిస్తున్న కొత్త సినిమాలోని వీడియో అంటూ పలువురు కామెంట్స్ చేశారు. ఇప్పటికీ దానిపై క్లారిటీ లేదు.
ఇక తాజాగా నరేష్, పవిత్రను పెళ్లి చేసుకున్న వీడియోను రిలీజ్ చేశాడు. ఆ వీడియోకు ఒక పవిత్ర బంధం, రెండు మనుసులు, మూడు ముళ్లు, ఏడడుగులు, మీ ఆశిస్సులు కోరుకుంటూ పవిత్ర నరేష్ అంటూ కాప్షన్ ఇచ్చాడు. దాంతో ఆ వీడియో కూడా క్షణాల్లోనే వైరల్ అయింది. అయితే ఈ వీడియో కూడా సినిమాలోని ఓ సీన్ అంటూ పలువురు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా తాజాగా దీనిపై నరేష్ స్పందించాడు.
నరేష్ కీలకపాత్రలో నటించిన ‘ఇంటింటి రామాయణం’ ప్రెస్మీట్లో తన పెళ్లి వీడియోపై మాట్లాడాడు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. రియల్ లైఫ్ వేరు, రీల్ లైఫ్ వేరు. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తా. అప్పటివరకు ఓపికతో ఉండండి. ప్రస్తుతం నాకు ప్రైవసీ కావాలంటూ నరేష్ చెప్పుకొచ్చాడు. దాంతో ఆ వీడియో సినిమాలోని సన్నివేశమే తెలుస్తుంది. ఇక వీరిద్దరూ ప్రస్తుతం ఎమ్.ఎస్ రాజు దర్శకత్వంలో భార్య భర్తలుగా సినిమా చేస్తున్నారు. అందులోని సన్నివేశమే ఇదని పులువురు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు.