Nani | ‘హిట్’ ఫ్రాంచైజీలో ఇప్పటివరకూ వచ్చిన రెండు సినిమాలు బాగా ఆడాయి. త్వరలో ఈ ఫ్రాంచైజీ నుంచి మూడో సినిమా రానుంది. నాని ఇందులో హీరో. ‘హిట్: ది థర్డ్ కేస్’ అనే టైటిల్ని ఖరారు చేశారు. డా.శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఈ సినిమాకు చెందిన పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో నాని ఉద్రేకపూరితంగా కనిపిస్తున్నారు.
ఓ ఫైర్ రాడ్తో విలన్ని కొడుతున్న ఈ పోస్టర్ మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంది. ఇందులో నాని హిట్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ఇందులో నాని మేకోవర్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకుల్ని సర్ప్రైజ్కు గురిచేస్తుందని మేకర్స్ తెలిపారు. శ్రీనిధి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే1న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె.మేయర్, నిర్మాణం: వాల్పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్.