Jersey Movie | టాలీవుడ్ స్టార్ హీరో నాని కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అంటే అభిమానులతో పాటు ప్రేక్షకుల టక్కున చెప్పేది ‘జెర్సీ’ (Jersey). స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక నటించింది. 2019 ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా నాని కెరీర్లో ఆల్ టైం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా వచ్చి 5 ఏండ్లు అయిన సందర్భంగా సుదర్శన్‌లో ప్రత్యేక షో కూడా వేశారు. అయితే ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒక రేంజ్లో హిట్ అయ్యింది. తాజాగా ఈ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను నాని కొడుకు అర్జున్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను నాని సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేసాడు. ఇక ఈ వీడియోను మీరు చూసేయండి.
#Nani‘s son Junnu tries (he started learning) “JERSEY THEME SONG” on keyboard 🎹. pic.twitter.com/0TbbjjmhNF
— Movies4u Official (@Movies4u_Officl) April 22, 2024