Nani HIT 3 Movie | ఈ మధ్య విడుదలయిన తెలుగు సినిమాలకు మొదటిరోజు నుంచే నెగిటివ్ రివ్యూలు వస్తున్న విషయం తెలిసిందే. గతవారం విడుదలైన అర్జున్ సన్నాఫ్ వైజయంతీతో పాటు ఇటీవల విడుదలైన మ్యాడ్ స్వ్కేర్ చిత్రాలకు పలు వెబ్‌సెట్స్ సినిమా బాగలేదని నెగిటివ్ రివ్యూలు ఇచ్చాయి. అయితే దీనిపై చిత్రబృందం ఆగ్రహాం వ్యక్తం చేసింది. సినిమా బాగున్న కూడా కొన్ని వెబ్సైట్లు కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నాయని.. టాలీవుడ్లో రివ్యూలు బ్యాన్ చేయాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. తాజాగా ఇదే విషయంపై కథనాయకుడు నాని స్పందించాడు.
నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం హిట్ 3. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్ నుంచి వస్తున్న 3వ చిత్రమిది. ఈ చిత్రంలో నాని కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా.. మే 01న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌లో షురూ చేశారు. ఇందులో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గోంటున్నాడు నాని. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నానిని.. సినిమా విడుదల కాగానే రివ్యూలు ఎందుకు అని ఈ మధ్య అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి అని అడుగగా.. నాని మాట్లాడుతూ..
సినిమాలకు రివ్యూలు ఇచ్చేవారు ఒకరోజు ఆగమని చిత్రయూనిట్లు చెబుతున్నాయి. వాళ్లు ఎందుకు ఆగుతారు. దీనిని ఒక్కరోజు లాగవచ్చు.. లేదా రెండు రోజులు లాగవచ్చు.. కానీ చెప్పాల్సింది మాత్రం ఆపరు. ఇంతకుముందు అంటే సోషల్ మీడియా లాంటివి లేవు. కానీ ఇప్పుడు ఏం చేసిన తెలుస్తుంది. కానీ రివ్యూలు ఇచ్చేవాళ్లు కూడా.. నాకు నచ్చలేదని చెప్పకుండా.. ప్రజలకు నచ్చట్లే అని చెప్పడం కరెక్ట్ కాదు. అందుకు నాకు నచ్చలేదని చెప్పండి. మీరు చెప్పింది 10 రోజుల్లో జరిగితే అది డిజాస్టార్ అని డిక్లేర్ చేయండి.