Psych Siddhartha | టాలీవుడ్ యువ నటుడు నందు, యామిని భాస్కర్ జంటగా నటిస్తున్న సినిమా ‘సైక్ సిద్ధార్థ’. మీలాంటి యువకుడి కథ అనేది ఉపశీర్షిక. అడల్ట్ కామెడీతో తెరకెక్కుతున్న ఈ మూవీకి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రి, మౌనిక తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాత శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు నందు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే అడల్ట్ కామెడీగా ఈ చిత్రం రాబోతుందని తెలుస్తుంది. ఎక్కువగా బూతులతోనే ట్రైలర్ను నింపేశారు.