Balakrishna Welcomes Rajinikanth | సూపర్ స్టార్ రజనీకాంత్ విజయవాడకు చేరుకున్నారు. దివంగత ఎన్టీఆర్ శత జయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు రజనీకాంత్ విజయవాడకు వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘన స్వాగతం పలికాడు. ఇక ఎయిర్ పోర్ట్‌లో బాలకృష్ణ, రజనీకాంత్‌లు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక శుక్రవారం సాయంత్రం పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సభ జరగనుంది. ఈ వేడుకల కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మొత్తం 10 వేల మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలు వేశారు. ఈ సభలో చంద్రబాబు, బాలకృష్ణ, రజనీకాంత్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొంటారు. అసెంబ్లీలో ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్యపరుస్తూ వివిధ వేదికలపై చేసిన ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను ఈ సందర్భంగా విడుదల చేయనున్నారు.