బిజినేపల్లి, మార్చి 7 : నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలోని గుట్టపై కొలువైన వెంకన్న క్షేత్రాన్ని సినీనటుడు మహేశ్‌బాబు సతీమణి, సినీనటి నమత్ర శిరోద్కర్ దర్శించుకున్నారు. మంగళవారం ఆలయంలోని శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రముఖ నిర్మాత, ఏసీఎన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ కలిసి వచ్చి నమ్రత ప్రత్యేక పూజలు చేశారు. క్షేత్ర చరిత్రను ఆలయ కమిటీ సభ్యులు వారికి వివరించి అనంతరం సన్మానించారు. అంతకుముందు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.