Kareena Kapoor | ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘2016 is the new 2026’ అనే సరికొత్త ట్రెండ్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. 2026 ప్రారంభంలో ఉన్న నెటిజన్లు, సెలబ్రిటీలు సరిగ్గా ఒక దశాబ్దం వెనక్కి వెళ్లి తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. అయితే ఈ ట్రెండ్‌లో బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్ కూడా భాగమయ్యింది. 2016 తన జ్ఞాపకాలకు సంబంధించిన ఫొటోలను తాజాగా కరీనా పంచుకుంది. 2016ను తన Year of the Bump (గర్భం దాల్చిన ఏడాది)గా అభివర్ణిస్తూ, తన మొదటి కుమారుడు తైమూర్ అలీ ఖాన్ పుట్టకముందు నాటి అరుదైన అన్‌సీన్ ఫోటోలను ఆమె అభిమానులతో పంచుకుంది.
ముఖ్యంగా తైమూర్ జన్మించడానికి కేవలం 48 గంటల ముందు సల్మాన్ ఖాన్, సోదరి కరిష్మా కపూర్ మరియు మలైకా అరోరాలతో కలిసి దిగిన ఫోటోతో పాటు, టైగర్ ప్రింట్ స్విమ్‌సూట్‌లో తన బేబీ బంప్‌ను చూపిస్తూ దిగిన మిర్రర్ సెల్ఫీ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒక మ్యాగజైన్ కవర్ షూట్ సమయంలో తాను మూడున్నర నెలల గర్భవతినని, ఆ విషయం అప్పట్లో ఎవరికీ తెలియదనే ఆసక్తికర రహస్యాన్ని కూడా ఆమె బయటపెట్టారు. వీటితో పాటు భర్త సైఫ్ అలీ ఖాన్ తన బేబీ బంప్‌ను పట్టుకుని ఉన్న క్యూట్ ఫోటోలు, బాబు పుట్టిన తర్వాత హాస్పిటల్లో దిగిన ఫోటోలు ఈ ఆల్బమ్‌లో ఉన్నాయి. కరీనాతో పాటు అనన్య పాండే, సోనమ్ కపూర్ వంటి పలువురు నటీమణులు కూడా తమ 2016 నాటి జ్ఞాపకాలను పంచుకుంటున్నారు.