దక్షిణాది సినీ పరిశ్రమ మరో నటుడిని కోల్పోయింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో ప్రతి నాయకుడిగా మెప్పించిన నటుడు కాజన్ ఖాన్ గుండెపోటుతో సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతి వార్తను నిర్మాత ఎన్ఎం. బాదుషా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
కాజన్ ఖాన్ మరణం గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేరళలో జన్మించిన కాజన్ ఖాన్ తమిళ చిత్రం ‘సెంతమిజ్ పాట్టు’తో విలన్గా తెరంగేట్రం చేశారు. తెలుగులో ‘అమ్మ కొడుకు’, ‘సూపర్ పోలీస్’, ‘భద్రాచలం’ వంటి చిత్రాల్లో కాజన్ ఖాన్ నటించారు. దక్షిణాది భాషల్లో దాదాపు 50 చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించారు.