Devara 2 Movie | అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం దేవర. సముద్రంపై ఆధారపడిన ప్రజల జీవితాలపై వచ్చిన ఈ చిత్రం గతేడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇదిలావుంటే నేడు ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజు కావడంతో ఆయనకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ కూడా శివకి బర్త్డే విషెస్ తెలిపాడు.
పుట్టినరోజు శుభాకాంక్షలు శివ!. మాట్లాడకుండానే, మౌనంగానే తన బలాన్ని చూపించే సినిమా మేకర్ మీరు. మీరు మరెన్నో స్ఫూర్తిదాయకమైన కథలను తీయాలని, మాకు గుర్తుండిపోయే మరెన్నో మంచి క్షణాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను. దేవర 2తో మళ్ళీ మీతో కలిసి ప్రయాణం చేయడానికి వేచి చూడలేకపోతున్నాను అంటూ ఎన్టీఆర్ రాసుకోచ్చాడు.
Happy Birthday Siva…
A filmmaker who speaks through silence and strength.
Wishing you many more stories that inspire and moments that live on with us. Can’t wait 2 ride the wave once again. pic.twitter.com/f2K4gIqX15— Jr NTR (@tarak9999) June 15, 2025