Jayam Ravi | ఒకవైపు మాజీ భార్య ఆర్తితో విడాకుల వివాదంతో వార్తల్లో నిలుస్తునే.. మరోవైపు తన కెరీర్లో కీలక ముందడుగు వేశాడు నటుడు జయం రవి (రవి మోహన్). తాజాగా ఈ నటుడు ‘రవిమోహన్ స్టూడియోస్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. చెన్నైలో ఈ వేడుక ఘనంగా జరుగగా.. ఈ ఈవెంట్‌కి రవి తన ప్రేయాసి కెన్నిషాతో కలిసి వచ్చి ఘనంగా ప్రారంభించారు. ఇక ఈ వేడుకకు.. ముఖ్య అతిథులుగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, తమిళ హీరోలు కార్తీతో పాటు, శివకార్తికేయన్ సూర్య, అథర్వ, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్, దర్శకురాలు సుధా కొంగరతో పాటు పలువురు స్టార్ సెలబ్రీటిలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రవి మోహన్ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మించబోయే తొలి రెండు సినిమాలను కూడా ప్రకటించారు. అందులో మొదటి సినిమాలో రవి మోహన్ హీరోగా కార్తీక్ యోగి దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. SJ సూర్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక రెండవ సినిమాలో హాస్య నటుడు యోగిబాబు లీడ్ లో రాబోతోంది. ఈ సినిమాను స్వయంగా రవి మోహన్ దర్శకత్వం వహించబోతున్నాడు.
Stills from Pooja ✨#RaviMohanStudios #RMSLaunch #srminternationalrealestate @BoomCarsChennai @BrigadeGroup pic.twitter.com/hLv9hMhpDN
— Ravi Mohan Studios (@RaviMohanStudio) August 26, 2025
Moments of Ravi Mohan from RMS Launch ✨#RaviMohanStudios #RMSLaunch#srminternationalrealestate @BoomCarsChennai @BrigadeGroup pic.twitter.com/uikdNIuuIi
— Ravi Mohan Studios (@RaviMohanStudio) August 26, 2025