ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం పొందిన సైనికుడు మురళీనాయక్ జీవితకథ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గౌతమ్‌కృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై కె.సురేష్‌బాబు నిర్మిస్తున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ సినిమా తాలూకు ప్రకటన చేశారు. హీరో గౌతమ్‌కృష్ణ మాట్లాడుతూ ‘ఇది ఓ రియల్ హీరో కథ. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. తెలుగు సైనికుడి మీద వస్తున్న తొలి బయోపిక్ ఇది.
మురళీనాయక్ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు ఆయన గురించి తెలుసుకొని నాకు కన్నీళ్లు ఆగలేదు. అలాంటి గొప్ప సైనికుడి కథ ప్రపంచానికి తెలియాలనే సంకల్పంతో ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాం’ అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీనాయక్ జీవితం ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాత కె.సురేష్‌బాబు పేర్కొన్నారు. ఈ సినిమా భారతీయుల గుండెల్లో నిలిచిపోవాలని మురళీనాయక్ తల్లిదండ్రులు ఆకాంక్షించారు.