పుడమిని పచ్చదనంతో నింపేందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొని జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు నటుడు ఫిష్ వెంకట్. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్న ఫిష్ వెంకట్, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు.+