Cool Suresh | యూట్యూబ్ వీడియోస్‌తో కెరీర్ ప్రారంభించి చిన్న చిన్న పాత్రలు వేస్తూ కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కూల్ సురేశ్ (Cool Suresh). బకాసురన్, తోడ్రా, డీడీ రిటర్న్స్‌తో పాటు పలు సినిమాల్లో కమెడియన్‌గా కనిపించి అలరించాడు. ఇక తాజాగా తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ (Mansoor Ali khan) తెరకెక్కించిన సరక్కు (Sarakku) సినిమా ప్రమోషన్లో సురేశ్ అతిథిగా పాల్గొన్నాడు. అయితే ఈ వేడుకలో కూల్ సురేశ్ చేసిన అనుచిత ప్రవర్తన వివాదాస్పదంగా మారింది.
వివరాల్లోకెళితే.. మన్సూర్ అలీ ఖాన్, యోగి బాబు, కె ఎస్ రవికుమార్, మొట్టా రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం సరక్కు(Sarakku). జయకుమార్ జె దర్శకత్వం వహిస్తుండగా.. మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali khan) నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ రీసెంట్గా జరిగింది. ఇక ఈ ఆడియో లాంచ్ ఈవెంట్లో కూల్ సురేశ్ అతిథిగా వచ్చాడు. అయితే ఈ వేడుకలో కూల్ సురేశ్ చేసిన అనుచిత ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఈవెంట్లో చిత్రబృందం గురించి మాట్లాడుతూ.. ఒక్కసారిగా పక్కనే ఉన్న యాంకర్ మెడలో బలవంతంగా పూలమాల వేశాడు. సురేశ్ ప్రవర్తనతో ఆమె చాలా ఇబ్బందిపడింది. పూల మాల కింద పడేసి.. అసహనం వ్యక్తం చేసింది. అనంతరం కన్నీళ్లు పెట్టుకుంది.
Cool Suresh needs to be banned from being invited to events. The nuisance is alarming. He just said he is doing this for ‘content’ – so stupid! pic.twitter.com/XVocSoWLwF
— Siddarth Srinivas (@sidhuwrites) September 20, 2023
ఇక ఇదంతా గమనించిన నటుడు మన్సూర్ అలీఖాన్.. ఆమెకు అందరి ముందు క్షమాపణలు చెప్పాడు. తర్వాత సురేశ్‌ను కూడా క్షమాపణలు చెప్పాలని అడిగాడు. అయితే ఈ ఘటనపై కూల్ సురేశ్ స్పందిస్తూ.. ప్రచారంలో భాగంగానే తాను ఈ పని చేశానని.. క్షమించాలని చెప్పాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజెన్లు ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించకూడదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
CoolSuresh: I have done this for a content https://t.co/feYCszI32q pic.twitter.com/sWoJrDjVOT
— AmuthaBharathi (@CinemaWithAB) September 20, 2023